ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విక్రయాలను పెంచుకునేందుకు దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం
టాటా మోటార్స్ భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు అందిస్తోంది.
టాటా కర్వ్ ఈవీపై రూ.3.35 లక్షల వరకు, హారియర్ ఈవీపై రూ.2.75 లక్షల వరకు, పంచ్ ఈవీపై రూ.1.45 లక్షల వరకు, టియాగో ఈవీపై రూ.1.45 లక్షల వరకు తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్లలో నగదు తగ్గింపు, ఎక్స్ఛేంజ్ బోనస్, స్క్రాపేజ్ ప్రయోజనాలు, లాయల్టీ ఇన్సెంటివ్‌లు ఉన్నాయి.