TG: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీ డ్రగ్స్‌ని పోలీసులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన నలుగురు అంతర్జాతీయ ప్రయాణికులు సహా మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు. రూ.9.5 కోట్లు విలువ చేసే 27.15 కిలోల హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. NDPS చట్టం కింద నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.