దుబాయ్‌లోని జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఏకంగా 20 నిమిషాల వ్యవధిలో కనీసం ఏడు పేలుళ్లు జరగ్గా.. పెద్దఎత్తున మంటలు, పొగలు వ్యాపించాయని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యెమెన్ హౌతీలు ఈ దాడులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనిపై దుబాయ్ అధికారుల నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.