AP: 2025-26 ఆర్థిక సంవత్సరంలో మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు జరిగిన విక్రయాల్లో భారతీయ తయారీ మద్యం (ఐఎంఎల్) అమ్మకాలు 14.59 శాతం పెరిగి 362 లక్షల కేసుల నుంచి 414 లక్షల కేసులకు చేరాయి. బీర్ అమ్మకాలు 70.29 శాతం పెరిగి 136 లక్షల కేసుల నుంచి 232 లక్షల కేసులకు చేరుకున్నాయి. ఈ పెరుగుదలతో మొత్తం మద్యం అమ్మకాల విలువ రూ.29,440 కోట్ల నుంచి రూ.31,237 కోట్లకు చేరి 6.11 శాతం వృద్ధి నమోదైంది.