భారీగా పెరిగిన పాత బంగారం విక్రయాలు

1613చూసినవారు
భారీగా పెరిగిన పాత బంగారం విక్రయాలు
పెట్టుబడి సాధనంగా భావించి బంగారం కొనుగోలు చేసేవారికి ఇటీవల కాలంలో మంచి లాభాలు వచ్చాయి. అయితే, గడిచిన కొద్దిరోజులుగా బంగారం ధర తగ్గుముఖం పట్టడంతో, మరింత పడిపోతుందన్న భయంతో కొందరు తమ వద్ద ఉన్న పాత బంగారాన్ని విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇండియా బులియన్‌, జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ ప్రకారం, ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో దేశీయ కుటుంబాలు 50 టన్నుల బంగారాన్ని విక్రయించాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 43 శాతం అధికం.

సంబంధిత పోస్ట్