నూతన సంవత్సర ఆరంభంలోనే ఏపీ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రావడం శుభపరిణామమని, ఇది ప్రజలందరికీ గర్వకారణమని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి కూటమి ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయని, 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' కార్యక్రమం, పారదర్శక విధానాలు రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మారుస్తున్నాయని, 'ఎస్క్రో ఆధారిత మెకానిజం' ద్వారా పెట్టుబడిదారులకు భరోసా లభిస్తోందని ఆయన పేర్కొన్నారు.