ఈఫిల్ టవర్‌ పై భారీ పిడుగు.. వైరల్ వీడియో

8794చూసినవారు
ఫ్రెంచ్ రాజధాని పారిస్ నగరంలో తాజా వర్షాల క్రమంలో రాత్రిపూట ఈఫిల్ టవర్‌పై ఓ శక్తివంతమైన పిడుగు పడింది. జూన్ 28న ఉరుములతో కూడిన తుఫానుల సమయంలో జరిగిన ఈ అద్భుత దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పిడుగు పాటు కాంతితో పారిస్ నగరం అద్భుతంగా వెలిగిపోతున్న 6-సెకన్ల వీడియో వైరల్ అయింది. ఈఫిల్ టవర్‌పై సగటున సంవత్సరానికి ఐదుసార్లు పిడుగులు పడతాయని, విద్యుత్తును సురక్షితంగా భూమిలోకి పంపే సేఫ్ రాడ్లు అమర్చబడి ఉన్నాయని నిపుణులు తెలిపారు.

సంబంధిత పోస్ట్