దేశ సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్న యువత కోసం భారత వాయుసేన అగ్నిపథ్ పథకం కింద ‘అగ్నివీర్ వాయు (02/2027) బ్యాచ్’ నియామకాలకు
నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన అవివాహిత పురుషులు, మహిళలు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. 2005 జులై 1 నుంచి 2010 జనవరి 1 మధ్య జన్మించిన, 10+2, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. ఎంపికైన వారికి నాలుగేళ్లపాటు సేవలందించే అవకాశం ఉంటుంది. జీతం రూ.30,000 నుంచి ప్రారంభమై, నాలుగేళ్ల తర్వాత సుమారు రూ.10.04 లక్షల సేవా నిధి అందజేస్తారు. ఆన్‌లైన్ దరఖాస్తులు జులై 6 నుంచి 26 వరకు కొనసాగనున్నాయి. ఆన్‌లైన్
పరీక్షలు సెప్టెంబర్ 22, 23 తేదీల్లో నిర్వహించబడతాయి.