ఆదోనిలో భారీగా వెండి పట్టివేత.. రూ.33 లక్షల విలువైన బిస్కెట్లు స్వాధీనం

24చూసినవారు
ఆదోనిలో భారీగా వెండి పట్టివేత.. రూ.33 లక్షల విలువైన బిస్కెట్లు స్వాధీనం
కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో సుమారు రూ.33 లక్షల విలువైన 13.5 కిలోల వెండి బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఎమ్మిగనూరుకు చెందిన ఇద్దరు వెండి వ్యాపారులు షేక్ షాకీర్, అక్షయ్ జాదవ్ సరైన పత్రాలు చూపించలేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ వెండి తరలింపు వెనుక అక్రమ వ్యాపారం లేదా మాఫియా ప్రమేయం ఉండొచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న వెండిని ఆదాయపు పన్ను అధికారులకు అప్పగించనున్నట్లు ఆదోని సీఐ రాజశేఖర్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్