భార్య ప్రైవేట్ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌లోని కటిహార్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. 2023లో పెళ్లైన దంపతుల మధ్య అనుమానాల కారణంగా విభేదాలు పెరిగాయి. భార్య పుట్టింటికి వెళ్లిన తర్వాత ఆమెపై కక్ష పెంచుకున్న భర్త, వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక నిఘాతో నిందితుడిని పట్టుకుని మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.