ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సర్వత్ గ్రామంలో ఇర్షాద్ మాలిక్, అతని భార్య, ఇద్దరు పిల్లల మృతదేహాలు ఇంట్లోనే లభ్యమయ్యాయి. అయితే ఈ ఘటనను సామూహిక ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబం ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది.