సంతానం లేకుండా మరణించిన హిందూ వివాహిత మహిళ.. తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన వారసత్వ ఆస్తిలో ఆమె భర్తకు ఎటువంటి హక్కు ఉండదని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. వీలునామా లేకుండా మరణిస్తే ఆ ఆస్తి ఆమె కన్న తండ్రికి పుట్టిన వారసులకే చెందుతుందని స్పష్టం చేసింది. అనకాపల్లి జిల్లా పెంటకోట గ్రామానికి చెందిన చిక్కాల వెంకాయమ్మ ఆస్తి వివాదంపై ఈ తీర్పు వెలువడింది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15(2)(ఎ)ను ప్రస్తావిస్తూ జస్టిస్ తర్లదా రాజశేఖర్ రావు ఈ తీర్పును వెలువరించారు.