కోమాలో ఉన్న భర్త వీర్యం కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన భార్య!

4667చూసినవారు
కోమాలో ఉన్న భర్త వీర్యం కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన భార్య!
ఢిల్లీకి చెందిన ఓ మహిళ, కోమాలో ఉన్న తన భర్త వీర్యాన్ని భవిష్యత్తులో తల్లిని అయ్యేందుకు నిల్వ చేసుకునేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. 2025 మార్చి నుంచి కోమాలో ఉన్న భర్త వీర్యాన్ని సేకరించి, భద్రపరచుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె పిటిషన్‌లో కోరింది. పిటిషనర్ తరఫు న్యాయవాది అర్జిత్ గౌర్ వాదనలు వినిపించారు. భర్త ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా వీర్య సేకరణ సురక్షితమేనా అని నిర్ధారించడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ప్రస్తుత చట్టాల ప్రకారం వీర్య సేకరణకు భార్యాభర్తల అంగీకారం తప్పనిసరి. ఈ కేసు తదుపరి విచారణ గురువారం జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్