భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టిన ఘటన.. మృతదేహం కోసం తవ్వకాలు (వీడియో)

29726చూసినవారు
AP: అనంతపురం జిల్లా గోళ్ల గ్రామానికి చెందిన సుకన్యకు బెళుగుప్ప మండలం హనిమిరెడ్డిపల్లికి చెందిన హనుమంతు (36)తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. నాలుగు నెలల క్రితం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన హనుమంతు భార్యతో గొడవపడ్డాడు. ఆమె అక్కడే ఉన్న రోకలితో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దాంతో సుకన్య ఇంటి ముందే గొయ్యి తీసి పాతిపెట్టింది. ఇరుగుపొరుగు వాళ్లకు అనుమానం రాకుండా భర్త ఇల్లు వదిలి వెళ్లాడని చెప్పుకొచ్చింది. తండ్రిని చంపిన విషయం బంధువులకు కూతురు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. మృతదేహం కోసం పోలీసులు తవ్వకాలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్