బైక్‌ పైనుంచి తోసేసి భార్యను చంపిన భర్త.. కారణం ఇదే!

5607చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి మార్చి 25న తన భార్యను బైక్‌పై తీసుకెళ్తూ ఉద్దేశపూర్వకంగా కిందకు తోసేశాడు. ఒక్కసారిగా పడిపోవడంతో ఆమె తలకు తీవ్ర గాయాలు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. బర్త్‌డే పార్టీ నుంచి తిరిగి వస్తూ ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు సమాచారం. కోపంతో భర్త ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటన సీసీటీవీలో రికార్డ్ కావడంతో వీడియో వైరల్‌గా మారింది. అయితే కట్న వేధింపులే కారణమని మృతురాలి కుటుంబం ఆరోపిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్