భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

21059చూసినవారు
భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త
TG: జగిత్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చంపి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నారు. మల్యాల మండలం నూకపల్లిలో ఈ ఘటన జరిగింది. భార్య లక్ష్మి (32) గొంతుకు టవల్‌ చుట్టి భర్త హత్య చేశాడు. అనంతరం భర్త నాగరాజు (40) ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్