మద్యం మత్తులో భార్యను చంపిన భర్త

53చూసినవారు
మద్యం మత్తులో భార్యను చంపిన భర్త
AP: ఏలూరు జిల్లా శనివారపుపేటలో దారుణం జరిగింది. మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన భర్త నరేష్, తన భార్య నాగలక్ష్మి (30) ని కత్తెరతో పొడిచి హత్య చేశాడు. గత కొంతకాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న నరేష్, గొడవపడి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. వీరిద్దరికి ఇద్దరు పిల్లలున్నారు. దాడి తర్వాత నరేష్ పరారయ్యాడు. తీవ్ర గాయాలైన నాగలక్ష్మి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్