అనుమానంతో భార్యను రోకలి బండతో బాది హత్య చేసిన భర్త (వీడియో)

11027చూసినవారు
AP: మార్కాపురం జిల్లా గిద్దలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. గంగరాజు అనే వ్యక్తి మద్యానికి బానిసై, తన భార్య ప్రేమ కుమారిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో గురువారం ఉదయం రోకలి బండతో దాడి చేసి ఆమెను కిరాతంగా హతమార్చాడు. హత్య అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా, నిందితుడిని వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని మృతురాలి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. తల్లి చనిపోవడంతో ఇద్దరు పిల్లలు గుక్కపెట్టి ఏడుస్తున్నారు.

సంబంధిత పోస్ట్