ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్‌నగర్‌లో ఓ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న దంపతులకు ఐదుగురు పిల్లలున్నారు. అయితే, భార్య తనకంటే 13 ఏళ్లు చిన్నవాడైన ప్రియుడితో రెండు నెలల క్రితం వెళ్లిపోయింది. ఇటీవల తిరిగి వచ్చిన భార్యతో భర్తకు గొడవ జరిగింది. చివరికి, ఇరు కుటుంబాల సమక్షంలో భర్త తన భార్యకు ప్రియుడితో పెళ్లి చేసి పంపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.