లవర్‌తో కలిసి భర్త హత్య.. భార్య, ప్రియుడి అరెస్ట్

26733చూసినవారు
లవర్‌తో కలిసి భర్త హత్య.. భార్య, ప్రియుడి అరెస్ట్
AP: అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం రైవాడ పంచాయతీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు అప్పలనాయుడు (43)గా గుర్తించారు. అప్పలనాయుడు భార్యకు గంగాధర్ అనే వ్యక్తితో కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మహిళను, గంగాధర్‌ను అరెస్ట్ చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్