మహిళ వారసత్వ ఆస్తిని భర్త లేదా అతడి వారసులు పొందలేరు: హైకోర్టు

26చూసినవారు
మహిళ వారసత్వ ఆస్తిని భర్త లేదా అతడి వారసులు పొందలేరు: హైకోర్టు
ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఓ హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే, ఆమె తల్లిదండ్రుల నుంచి వచ్చిన వారసత్వ ఆస్తిపై భర్తకు లేదా అతని వారసులకు హక్కు ఉండదని స్పష్టం చేసింది. ఆ ఆస్తి ఆమె తండ్రి వారసులకే చెందుతుందని తేల్చిచెప్పింది. మహిళకు సంతానం లేకపోయినా ఇదే నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15(2)(A) ప్రకారం జస్టిస్ రాజశేఖర్ రావు ఈ తీర్పును వెలువరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్