గర్భిణి భార్యపై లైంగిక దాడి.. భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష

26483చూసినవారు
గర్భిణి భార్యపై లైంగిక దాడి.. భర్తకు ఐదేళ్ల జైలు శిక్ష
TG: గర్భిణి అయిన భార్యపై అసహజ లైంగిక దాడి చేసిన భర్తకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఐదో అడిషనల్​సెషన్స్ జడ్జి ఐదేండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించారు. రాజేంద్రనగర్ జోన్ డీసీపీ ఎస్. శ్రీనివాస్ కథనం ప్రకారం.. నందిముస్లాయిగూడలో టైలర్​గా పనిచేసే వ్యక్తి భార్య గర్భవతి అయిన.. ఆమె ఇష్టానికి విరుద్ధంగా అసహజ పద్ధతిలో లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో కడుపుపై కొట్టేవాడు. వేధింపులు భరించలేక భార్య ఫిర్యాదు చేయడంతో బహదూర్‌పురా పీఎస్​లో కేసు నమోదైంది. సాక్ష్యాధారాలను పరిశీలించిన జడ్జి కె. అజేశ్​కుమార్ నిందితుడిని దోషిగా నిర్ధారించి శిక్ష విధించారు.

సంబంధిత పోస్ట్