భార్యను గొంతు నులిమి, గోడకేసి కొట్టి చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త

24468చూసినవారు
భార్యను గొంతు నులిమి, గోడకేసి కొట్టి చంపేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించిన భర్త
TG: హైదరాబాద్‌ బాచుపల్లి పరిధిలో భార్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఏపీకి చెందిన బాలకృష్ణ తరచూ మద్యం సేవించడం భార్యతో గొడవపడేవాడు. ఇదే క్రమంలో గత నెల 20న మళ్లీ గొడవ జరగ్గా, బాలకృష్ణ తన భార్య భార్గవి (35)ని గొంతు నులిమి, తలను గోడకు బలంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం చీరతో ఫ్యాన్‌కు వేలాడదీసి ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు విచారించారు. నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్