మహిళా స్వాట్‌ కమాండోను డంబెల్‌తో కొట్టి హత్య చేసిన భర్త

16426చూసినవారు
మహిళా స్వాట్‌ కమాండోను డంబెల్‌తో కొట్టి హత్య చేసిన భర్త
మహిళా స్వాట్‌ కమాండో కాజల్‌ చౌధరిని ఆమె భర్త అంకుర్‌ హత్య చేసిన ఘటన కలకలం రేపింది. దిల్లీలోని రక్షణ మంత్రిత్వ శాఖలో క్లర్క్‌గా పనిచేస్తున్న అంకుర్‌, ఆర్థిక విభేదాల కారణంగా భార్యపై దాడికి పాల్పడ్డాడు. డంబెల్‌తో కాజల్‌పై తీవ్రంగా కొట్టడంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాజల్‌ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్