ఉత్తర ప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో శుక్రవారం ఉదయం ఒక దారుణం చోటుచేసుకుంది. ఆస్తి వివాదం కారణంగా భర్త ప్రదీప్ చౌహాన్ తన భార్య, 45 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిషా చౌహాన్‌ను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ ఘటనలో వారి 17 ఏళ్ల కుమారుడు స్వల్పంగా గాయపడ్డాడు. నిషాను హత్య చేసిన అనంతరం ప్రదీప్ కూడా ఆత్మహత్యకు యత్నించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిషా మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన ప్రదీప్, అతని కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.