దేశంలోని మెట్రో నగరాల్లో ఆహార పరిశుభ్రత రేటింగ్‌లో హైదరాబాద్ చిట్టచివరన నిలిచింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్
ఇండియా (FSSAI) విడుదల చేసిన డేటా ప్రకారం, నగరంలోని 25,000 లైసెన్స్ పొందిన హోటళ్లలో కేవలం 2% (361) మాత్రమే పరిశుభ్రత రేటింగ్స్ పొందాయి. ఢిల్లీ, బెంగళూరు కంటే హైదరాబాద్ రేటింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. లైసెన్సులు లేని విక్రయాలు, గడువు ముగిసిన ఉత్పత్తుల వాడకం వంటివి బయటపడటంతో నగరంలో ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని నివేదిక స్పష్టం చేసింది.