హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం జరిగిన రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఫైనల్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,
మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ హీరోస్ జట్టు ముంబై డ్రీమర్స్‌ను 41-17 తేడాతో ఓడించి చాంపియన్‌గా అవతరించింది. సీఎం రేవంత్ రెడ్డి విజేతలకు ట్రోఫీని అందజేశారు. హైదరాబాద్ హీరోస్‌కు రూ.45 లక్షల ప్రైజ్‌మనీ లభించగా, రన్నరప్ ముంబై డ్రీమర్స్‌కు రూ.25 లక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాహుల్ బోస్, పీవీ సింధు, మృణాల్ ఠాకూర్ వంటి ప్రముఖులు కూడా పాల్గొన్నారు.