RCB vs SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు భారీ షాక్ తగిలింది. ఈ ఇన్నింగ్స్‌లో వరుసగా వికెట్లు పడుతున్నాయి. సుయాశ్ శర్మ బౌలింగ్‌లో (14.3) సలీల్ అరోరా (9) దేవ్‌దత్ పడిక్కల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. 137 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయిన హైదరాబాద్, ఈ ఓవర్లో 7 పరుగులు సాధించింది. ప్రస్తుతం ఇషాన్ కిషన్ (74) క్రీజులో కొనసాగుతుండగా, కొత్తగా అనికేత్ వర్మ బరిలోకి దిగాడు. 15 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 142/5గా ఉంది.