దుబాయ్‌లో హైదరాబాద్ యువతి అదృశ్యం

9926చూసినవారు
దుబాయ్‌లో హైదరాబాద్ యువతి అదృశ్యం
దుబాయ్‌లో హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువతి అదృశ్యం కలకలం రేపుతోంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాన్ని ఆదుకునేందుకు వైద్య విద్య పూర్తి చేసిన ఆమె గత ఏడాది ఆగస్టులో ఉపాధి కోసం దుబాయ్‌కు వెళ్లింది. అక్కడ ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె, మొదట్లో కుటుంబసభ్యులతో మాట్లాడేది. అయితే, గత నాలుగు నెలలుగా ఆమె నుంచి ఎటువంటి సమాచారం లేదు. ఆమె ఫోన్లు పనిచేయకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్జీఐఏ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్