తమిళనాడులోని కల్పక్కంలో ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రిసెర్చ్ (ఐజీసీఏఆర్)లో అణుశక్తిని ఉపయోగించి హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేసే ప్రపంచంలోనే మొట్టమొదటి కర్మాగారాన్ని
భారత్ ప్రారంభించింది. విద్యుత్తును ఉపయోగించకుండా, ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ నుండి వచ్చే అణు ఉష్ణాన్ని నేరుగా వాడుకుంటూ, కాపర్-క్లోరిన్ థర్మోకెమికల్ సైకిల్ ద్వారా నీటిని విచ్ఛిన్నం చేసి హైడ్రోజన్‌ను తయారుచేస్తారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డీఏఈ), ఐజీసీఏఆర్, బార్క్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించి, దేశ ఇంధన భద్రతను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం.