AP:
వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. 'నేను ఎలాంటి తప్పు చేయలేదు. జరిగిన తప్పులు మాత్రమే ఎత్తి చూపుతున్నాను. బీఆర్ నాయుడు రెచ్చిపోయి రెచ్చగొడితే నేను పిరికివాడిని కాదు. ధైర్యంతోనే
రాజకీయాలు చేస్తున్నాను. వైయస్ జగన్ మనిషిగానే చివరి వరకు పోరాటం చేస్తాను. మీ ప్రసార మాధ్యమాల బలంతో ఎంత అహంకారంతో రెచ్చిపోయినా నేను బలహీనుడనైనా పోరాటం చేస్తూనే ఉంటాను' అని పేర్కొన్నారు.