ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు వెళ్తా: షేక్ హసీనా

6061చూసినవారు
ఈ ఏడాదే బంగ్లాదేశ్‌కు వెళ్తా: షేక్ హసీనా
తీవ్ర రాజకీయ సంక్షోభం మధ్య భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై నమోదైన కేసులు, మరణశిక్షలు రాజకీయ ప్రేరేపితమని, న్యాయవ్యవస్థను ప్రతీకార సాధనంగా వాడుకుంటున్నారని ఆరోపించారు. మైనారిటీలపై దాడులు దేశ స్వాతంత్ర్యానికే ముప్పని హెచ్చరించిన ఆమె, ఈ ఏడాదే స్వదేశానికి తిరిగి వెళ్తానని, అవామీ లీగ్ ప్రజా బలంతో అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్