AP:
వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. తనను జైల్లో పెట్టారనే కోపం లేదని, అయితే తాను అనుకుంటే నిమిషంలో జైల్లో పెడతానని వార్నింగ్ ఇచ్చారు. సాయికృష్ణ కేసులో పవన్ కళ్యాణ్
రాజకీయాలు చేశారని, ఆయన కుటుంబ సభ్యులపై ఇష్టారీతిన పోస్టులు పెట్టారని విమర్శించారు. బ్లేడ్ బ్యాచ్‌లు, రౌడీలకు
వైసీపీ మద్దతిస్తోందని, సైకోను చూసుకునే
వైసీపీ నేతల ఆగడాలు పెరిగాయని ఆరోపించారు. హోంమంత్రిపై కూడా మేకప్ అంటూ కామెంట్స్ చేశారని, తన ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అని చంద్రబాబు హెచ్చరించారు.