AP: తన పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపిన వారికి ఏపీ డిప్యూటీ సీఎం,
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, శ్రేయోభిలాషులు,
జనసేన పార్టీ నాయకులు, కూటమి భాగస్వాములు, జన సైనికులు, వీర మహిళలు, అభిమానులు చూపిన ప్రేమ, ఆప్యాయతకు కృతజ్ఞతలు చెప్పారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పెరిగిందని, వారి అభిమానం మరింత బాధ్యతగా పనిచేయడానికి బలాన్ని ఇస్తుందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.