నేను ఎవరినీ రూ.25 కోట్లు అడగలేదు: ఎమ్మెల్యే బాధితురాలు (వీడియో)

3466చూసినవారు
AP: రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఎమ్మెల్యే బాధితురాలు మరో వీడియోను విడుదల చేశారు. ‘నేను ఎవరినీ రూ.25 కోట్లు అడగలేదు. రూ.25 కోట్లు అడిగినట్లు వైరల్ అవుతున్న ఆడియో నాది కాదు. నేను మాట్లాడినట్లు ఉన్న ఫుల్ ఆడియో ఏది. ఎవరితో మాట్లాడానో చెప్పాలి. అలానే ఫుల్ ఆడియో విడుదల చేయండి. నన్ను ప్రశ్నించే వారు.. ఎమ్మెల్యేను కూడా అదేవిధంగా ప్రశ్నించండి’ అని బాధితురాలు వీడియోలో అన్నారు.
Job Suitcase

Jobs near you