నేను మంత్రిగా రాలేదు.. భారతీయుడిగా వచ్చాను: లోకేశ్

8398చూసినవారు
బిహార్ అభివృద్ధి కోసం మరోసారి ఎన్డీయే కూటమిని గెలిపించాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్ వెళ్లిన ఆయన.. పాట్నాలో మీడియా సమావేశం నిర్వహించారు. ‘బిహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడి అభివృద్ధి పనులు, ప్రభుత్వ విధానంపై సంతోషంగా ఉంది. నేను ఏపీ మంత్రిగా ఇవాళ ఎన్డీయేకు మద్దతుగా ప్రచారంలో పాల్గొనడానికి పాట్నాకు రాలేదు. బాధ్యత గల భారతీయుడిగా వచ్చాను’ అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్