నటులు కావాలని పిల్లలను బలవంతం చేయలేదు: మోహన్ బాబు

6581చూసినవారు
నటులు కావాలని పిల్లలను బలవంతం చేయలేదు: మోహన్ బాబు
తెలుగు సినీ పరిశ్రమలో మోహన్ బాబు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 500కు పైగా చిత్రాల్లో నటించి, డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ వంటి బిరుదులు అందుకున్నారు. ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ పిల్లలు మంచు విష్ణు, మనోజ్ హీరోలుగా, మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా, యాంకర్ గా రాణిస్తున్నారు. అయితే మోహన్ బాబు తన పిల్లలు నటులు కావాలని కోరుకోలేదని, తన పెద్ద కుమారుడు మంచు విష్ణును ఐపీఎస్ ఆఫీసర్ గా చూడాలని కలలు కన్నానని, కానీ వారు తమ దారులను తామే ఎంచుకున్నారని స్వయంగా వెల్లడించారు. 'నా కుమారులను బలవంతంగా సినిమా ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకోలేదు. వారు నటులు కావడమనేది కేవలం దైవ నిర్ణయం' అని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్