మళయాళ నటుడు మోహన్‌లాల్ కీలక ప్రకటన చేశారు. తన వద్ద 10 ఏనుగు దంతాలు, ఏనుగు దంతాలతో చేసిన 13 విగ్రహాలు ఉన్నాయని వెల్లడించారు. వన్యప్రాణి సంబంధిత వస్తువులను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఆయన విచారణ ఎదుర్కొంటున్నారు. కేరళ అటవీ శాఖ ప్రవేశపెట్టిన క్షమాభిక్ష పథకంలో భాగంగా ఈ ప్రకటన చేశారు.