మోదీ లాంటి నాయకుడిని చూడలేదు: చంద్రబాబు

1454చూసినవారు
మోదీ లాంటి నాయకుడిని చూడలేదు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసించారు. మోదీ లాంటి నాయకుడిని తాను ఎప్పుడూ చూడలేదని, దేశాన్ని నిష్ఠతో ముందుకు నడిపిస్తున్నారని అన్నారు. జీఎస్టీ-2.0 పేదల జీవితాలను మారుస్తుందని, ప్రధాని ఆర్థిక సంస్కరణల రూపశిల్పి అని కొనియాడారు. 2047 నాటికి భారత్ అగ్రగామి దేశంగా నిలుస్తుందని, పేదల పాలిట దేవుడిగా మోదీ నిలుస్తున్నారని తెలిపారు. విశాఖపట్నానికి గూగుల్ డేటా కేంద్రం రావడానికి ప్రధాని సహకరించారని, దీనివల్ల రెండు లక్షల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.

సంబంధిత పోస్ట్