AP: చిత్తూరు జిల్లా, పలమనేరులోని 32వ వార్డు మున్సిపల్ ఎన్నికల్లో
వైసీపీ తరఫున పోటీ చేసిన ప్రసాద్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఓట్ల కోసం తాను పంచిన నగదును తిరిగి ఇవ్వాలని ఆయన కోరారు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి ఓటుకు 1000 రూపాయల చొప్పున పంపిణీ చేశానని, అయితే తనకు ఓటు వేయని 400 మంది వెంటనే డబ్బులు తిరిగి ఇవ్వాలని, లేదంటే వారి ఇళ్ల వద్దే ధర్నా చేస్తానని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు ప్రసాద్ రెడ్డి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.