పిఠాపురంలో కమిటీ వేయమని నేనే అడిగా: SVSN వర్మ

14చూసినవారు
పిఠాపురంలో కమిటీ వేయమని నేనే అడిగా: SVSN వర్మ
AP: పిఠాపురం నియోజకవర్గంలో కూటమి పక్షాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి నారా లోకేష్‌ను కోరినట్లు SVSN వర్మ వెల్లడించారు. అధిష్టానం తనను సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుందని, వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. టీడీపీ శ్రేణులకు కీలక సూచనలు చేస్తూ, అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకోవాలని, కూటమి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్