ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు నూతన రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ నాలుగు ముక్కలవుతుందని, కవిత కొత్త పార్టీ పెడతారని ఏడాది క్రితమే తాను చెప్పినట్లు ఎంపీ రఘునందన్ అన్నారు. కవిత పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ స్వాగతించారు. అయితే ఈ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.