"పవన్ హోం మంత్రి అయ్యే వరకూ శ్రవణ్ కుమార్ మీద కంప్లైంట్ ఇవ్వను": RRR (VIDEO)

16545చూసినవారు
AP: ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవ సమర శంఖారావం సభలో తనపై జడ శ్రవణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పందించారు. దళిత క్రైస్తవుల గురించి మాట్లాడితే నాలుక కోస్తానంటూ చేసిన వ్యాఖ్యలు క్రిమినల్ చర్యల కిందకు వస్తాయని అన్నారు. అయితే ప్రస్తుతం ఫిర్యాదు చేయనని, పవన్ కళ్యాణ్ హోం మంత్రి అయిన తర్వాతే శ్రవణ్ కుమార్‌పై ఫిర్యాదు చేస్తానని వ్యాఖ్యానించారు. తాను ఇతర మతాలను ఎప్పుడూ అగౌరవపరచలేదని, తన వ్యాఖ్యలను వక్రీకరించి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అనుమతి లేకుండా మైకులు వినియోగిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని కూడా ఆయన హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్