AP: తిరుపతిలో యువగళం బృందాన్ని ఆప్యాయంగా పలకరించిన మంత్రి నారా
లోకేశ్, యువగళం పాదయాత్ర జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. సుమారు 15 నిమిషాల పాటు కార్యకర్తలతో ముచ్చటించిన ఆయన, 'కార్యకర్తే అధినేత' లక్ష్యంతో కేడర్ సాధికారతకు కృషి చేస్తామని తెలిపారు. తన వెంట నడిచిన వారిని ఎప్పటికీ మరిచిపోనని ఆయన పేర్కొన్నారు.