భారత్-పాక్ మ్యాచ్‌పై ఐసీసీ జోక్యం.. మధ్యవర్తిగా ఇమ్రాన్ ఖ్వాజా నియామకం

3995చూసినవారు
భారత్-పాక్ మ్యాచ్‌పై ఐసీసీ జోక్యం.. మధ్యవర్తిగా ఇమ్రాన్ ఖ్వాజా నియామకం
ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ను పాకిస్తాన్ బాయ్‌కాట్ చేయడంతో, ఐసీసీ అధ్యక్షుడు జై షా జోక్యం చేసుకున్నారు. ఈ సున్నితమైన అంశాన్ని పరిష్కరించడానికి సింగపూర్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన అనుభవజ్ఞుడైన నిర్వాహకుడు ఇమ్రాన్ ఖ్వాజాను ప్రత్యేక ప్రతినిధిగా నియమించారు. ఖ్వాజా పీసీబీతో చర్చలు జరిపి, పాకిస్తాన్ నిర్ణయాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఖ్వాజా మధ్యవర్తిత్వాన్ని కూడా పాక్ బేఖాతరు చేస్తే, ఐసీసీ నిబంధనలను పక్కకు పెట్టి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ పాక్ భారత్‌తో మ్యాచ్ ఆడకూడదనే నిర్ణయానికి కట్టుబడి ఉంటే, ఆ జట్టు మ్యాచ్ పాయింట్లు కోల్పోవడంతో పాటు ఆర్థిక, పాలనాపరమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్