నొప్పి, వాపు తగ్గడానికి.. ఐస్ ప్యాక్ VS వేడి కాపడం, ఎప్పుడు ఏది వాడాలి?

12521చూసినవారు
నొప్పి, వాపు తగ్గడానికి.. ఐస్ ప్యాక్ VS వేడి కాపడం, ఎప్పుడు ఏది వాడాలి?
శరీరంలో ఎక్కడైనా వాపు, నొప్పి వచ్చినప్పుడు కాపడం పెట్టడం సాధారణం. అయితే, తాజాగా గాయాలైనప్పుడు, వాపు, మంట ఉన్నప్పుడు ఐస్ ప్యాక్ వాడటం మంచిది. దీనివల్ల లోకల్ ఉష్ణోగ్రతలు తగ్గి, రక్తనాళాలు సంకోచించి, వాపు తగ్గుతుంది. నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. దీర్ఘకాలిక నొప్పులు, కండరాల బిగుతు ఉన్నప్పుడు వేడి కాపడం మేలు చేస్తుంది. ఇది రక్తప్రసరణను వేగవంతం చేసి, కండరాలను రిలాక్స్ చేస్తుంది. నడుము నొప్పి, వెన్ను నొప్పి, డిస్క్‌ప్లాప్స్, సయాటికా వంటి సమస్యలకు వేడి కాపడం ఉపకరిస్తుంది. ఐస్ ప్యాక్, వేడి కాపడం రెండూ 10-15 నిమిషాలు పెట్టాలి.

సంబంధిత పోస్ట్