ఐసీఐసీఐ బ్యాంక్ తన క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి కొత్త నిబంధనలను అమలు చేయనుంది. బుక్ మై షోలో కాంప్లిమెంటరీ సినిమా టికెట్ల సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఇన్సూరెన్స్, ట్రాన్స్‌పోర్ట్ చెల్లింపులపై రివార్డ్ పాయింట్లు కొనసాగుతాయని స్పష్టం చేసింది. సూపర్ సేవల్ హెచ్‌పీసీఎల్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు ఇన్సూరెన్స్ చెల్లింపులపై రూ.40 వేల వరకు, ట్రాన్స్‌పోర్ట్ చెల్లింపులపై రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకు రివార్డ్ పాయింట్లు లభించనున్నాయి. ఈ మార్పులను వినియోగదారులు గమనించి, క్రెడిట్ కార్డు సేవలను ఉపయోగించుకోవాలని బ్యాంక్ సూచించింది.