ఐసీఎంఆర్ లో సైంటిస్ట్-బి ఉద్యోగాలు: మార్చి 1 దరఖాస్తుకు చివరి తేదీ

3108చూసినవారు
ఐసీఎంఆర్ లో సైంటిస్ట్-బి ఉద్యోగాలు: మార్చి 1 దరఖాస్తుకు చివరి తేదీ
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సైంటిస్ట్– బి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మొత్తం 27 ఖాళీలు ఉన్నాయి. సైంటిస్ట్–బి నాన్ మెడికల్ (25), సైంటిస్ట్–బి నాన్ మెడికల్ ఐటీ, కంప్యూటర్ సైన్స్ (01), సైంటిస్ట్-–బి నాన్ మెడికల్ ఫార్మకాలజీ (01) విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బయో మెడికల్ సైన్సెస్‌లో మాస్టర్స్ డిగ్రీ , ఎంఈ, ఎం.టెక్. కంప్యూటర్ సైన్స్,  ఫార్మసీలో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు. ఫిబ్రవరి 02 నుంచి దరఖాస్తులు ప్రారంభమయ్యాయి, మార్చి 01 చివరి తేదీ. జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.3000, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.2400 ఫీజుగా నిర్ణయించారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పూర్తి వివరాలకు www.aiimsexams.ac.in వెబ్​సైట్​ను సందర్శించవచ్చు.

సంబంధిత పోస్ట్