AP: అన్నం పెట్టే రైతుకు కష్టం వస్తే తనకు చాలా బాధ కలిగేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అన్నం పెట్టే రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. తాను ఒక సినిమా చేసేటప్పుడు రైతులకు కష్టం వచ్చిందని తెలిసి.. పలువురు కలిసి 3 వేల మందికిపైగా రైతులకు సహాయం చేశామన్నారు. రైతుల దయనీయ పరిస్థితిని అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు రూ.20.62 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.