బెంగాల్‌లో అధికారంలోకి వస్తే 45 రోజుల్లోనే సరిహద్దుల్లో కంచె ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. చొరబాటుదారులకు దీదీ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోందని ఆరోపించిన అమిత్ షా, దేశ భద్రతను కాపాడాలంటే బెంగాల్‌లో బీజేపీ విజయం తప్పనిసరి అని అన్నారు.